TG-3732
Telugu

నా హృదయాన కొలువైన

Naa Hrudayaana Koluvaina

0
views
పల్లవి

నా హృదయాన కొలువైన యేసయ్యా నా అణువణువు నిన్నే – ప్రస్తుతించెనే కీర్తనీయుడా నా హృదయార్పణతో – ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజార్హుడా (2) ||నా హృదయాన||

1వ చరణం

అగ్ని ఏడంతలై – మండుచుండినను అగ్ని జ్వాలలు తాకలేదులే – నీ ప్రియుల దేహాలను (2) అగ్ని బలము చల్లారెనే – శత్రు సమూహము అల్లాడెనే (2) నేను నీ స్వాస్థ్యమే – నీవు నా సొంతమే నా స్తోత్రబలులన్ని నీకేనయ్యా (2) ||నా హృదయాన||

2వ చరణం

అంతా వ్యర్థమని – వ్యర్థులైరెందరో నా గురి నీపై నిల్పినందుకే – నా పరుగు సార్థకమాయెనే (2) నీయందు పడిన ప్రయాసము – శాశ్వత కృపగా నాయందు నిలిచెనే (2) నీపై విశ్వాసమే – నన్ను బలపరచెనే నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును (2) ||నా హృదయాన||

3వ చరణం

విత్తినది ఒకరు – నీరు పోసింది వేరొకరు ఎరువు వేసింది ఎవ్వరైననూ – వృద్ధి చేసింది నీవే కదా (2) సంఘక్షేమాభివృద్ధికే – పరిచర్య ధర్మము నియమించినావే (2) నీ ఉపదేశమే – నన్ను స్థిరపరచెనే నా సర్వము నీకే అర్పింతును (2) ||నా హృదయాన||