TG-3285
Telugu

దేవుని వారసుల

Devuni Vaarasulam

0
views
పల్లవి

దేవుని వారసులం – ప్రేమ నివాసులము జీవన యాత్రికులం – యేసుని దాసులము నవ యుగ సైనికులం – పరలోక పౌరులము హల్లెలూయ – నవ యుగ సైనికులం – పరలోక పౌరులము ||దేవుని||

1వ చరణం

సజీవ సిలువ ప్రభు – సమాధి గెలుచుటకే విజేత ప్రేమికులం – విధేయ బోధకులం నిజముగ రక్షణ ప్రబలుటకై ధ్వజముగ సిలువను నిలుపుదుము (2) ||దేవుని||

2వ చరణం

ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగా విభు మహిమను గాంచ – విశ్వమే మేము గోల శుభములు గూర్చుచు మాలోన శోభిల్లు యేసుని చూపుదుము (2) ||దేవుని||

3వ చరణం

దారుణ హింస లలో – దేవుని దూతలుగా ఆరని జ్వాలలలో – ఆగని జయములతో మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసుని కీర్తింతుము (2) ||దేవుని||

4వ చరణం

పరిశుద్దాత్మునికై – ప్రార్థన సలుపుదము పరమాత్ముని రాక – బలము ప్రసాదింప ధరణిలో ప్రభువును జూపుటకై సర్వాంగ హోమము జేయుదము (2) ||దేవుని||

5వ చరణం

అనుదిన కూటములు – అందరి గృహములలో ఆనందముతోను – ఆరాధనలాయే వీనుల విందగు పాటలతో ధ్యానము చేయుచు మురియుదము (2) ||దేవుని||

6వ చరణం

హత సాక్షుల కాలం – అవనిలో చెలరేగ గతకాలపు సేవ – గొల్గొతా గిరి జేర భీతులలో బహు రీతులలో నూతన లోకము కాంక్షింతుము (2) ||దేవుని||