TG-4206
Telugu

సదాకాలము నీ యందే

Sadaakaalamu Nee Yande

0
views
పల్లవి

(యేసయ్యా) సదాకాలము – నీ యందే నా గురి నిలుపుచున్నాను (2) అక్షయ కిరీటం పొందాలని అనుక్షణం నే స్తుతియింతును (2) ఆరాధనా ఆరాధనా యేసయ్యా నీకే నా ఆరాధనా (2) ||సదాకాలము||

1వ చరణం

చుక్కాని లేని నావనై సంద్రాన నే చిక్కుబడగా (2) నా దరి చేరి – ఈ ధరలోన నీ దరి నడిపించావే (2) ||ఆరాధనా||

2వ చరణం

అన్య జనులు ఏకమై నిందలు నాపైన మోపినా (2) నిందలు బాపి – నన్నాదుకొని విడువని కృప చూపినావే (2) ||ఆరాధనా||

3వ చరణం

నాశనకరమైన ఊభిలో నేను పది కృంగగా (2) హస్తము చాచి – నను ఆదుకొని (నీ) ఆత్మతో బలపరచినావే (2) ||ఆరాధనా||