TG-4209
Telugu

సజీవుడవైన యేసయ్

Sajeevudavaina Yesayyaa

0
views
పల్లవి

సజీవుడవైన యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే సముద్రమంత సమృద్ధితో (2) ఆనందించెద నీలో – అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే – ఆనంద ధ్వనులతో (2) ధన రాసులే ఇలా – ధనవంతులకు – ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో – దయచేసినావే – ఇహ పరమున నాకు (2) శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివి శ్రేష్టమైన నీ వాగ్ధానములతో (2) ||సజీవుడవైన||

1వ చరణం

క్షేమము నొందుటయే – సర్వ జనులకు – ప్రయాసగా మారే క్షేమాధారము నీవై – దీర్ఘాయువుతో – సంతృప్తి పరతువు నన్ను (2) నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే నిత్యమైన నీ సత్య వాక్యముతో (2) ||సజీవుడవైన||

2వ చరణం

నలువది ఏండ్లు – నీ స్వాస్థ్యమును – మోసినది నీవే నీ కృప కాంతిలో – నా చేయి విడువక – నడిపించుచున్నది నీవే (2) పరమ రాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే పరిపూర్ణమైన నీ ఉపదేశమును (2) ||సజీవుడవైన||