TG-4650
Telugu

ఈ మరణము కాదు శాశ్వతము

Ee Maranamu Kaadu Shaashvathamu

0
views
పల్లవి

ఈ మరణము కాదు శాశ్వతము పరలోకమే మనకు నివాసము (2) యేసు తెచ్చెను మనకు రక్షణ ఎంత అద్బుతము ఆ నిరీక్షణ (2) ||ఈ మరణము||

1వ చరణం

జగతు పునాది వేయక ముందే మనమెవ్వరో ఎవరికి తెలియక ముందే (2) మనలను ఏర్పరచుకొన్న ఆ దేవుడు తిరిగి తన దరికి మనల పిలిచే వేళ (2) తిరిగి తన దరికి మనల పిలిచే వేళ ||ఈ మరణము||

2వ చరణం

యేసు నామమును ఎరిగిన వారు పాప శ్రమలకు అర్హులు కారు (2) తిరిగి లేచెదరు యేసు నామములో కొలువు తీరెదరు పరలోకంలో (2) కొలువు తీరెదరు పరలోకంలో ||ఈ మరణము||

3వ చరణం

కురిసే ప్రతి కంటి నీరు ప్రభువు తుడుచును మరణము మబ్బులను కరిగించును (2) వేదనలు రోదనలు రద్దు చేయును గతకాల సంగతులు గతించి పోవును (2) గతకాల సంగతులు గతించి పోవును ||ఈ మరణము||