♪♫
TG-2016
Telugu
నిజముగా మొర పెట్టిన దేవుడాలకించకుండునా
nijamugaa mora pettina deevudaalakinchakundunaa
71
views
పల్లవి
నిజముగా మొర పెట్టిన దేవుడాలకించకుండునా సహనముతో కనిపెట్టిన సమాధానమీయకుండునా జీవముగల దేవుడు మౌనముగా ఉండునా తన పిల్లలకాయన మేలు చేయకుండునా (2) ||నిజముగా||
1వ చరణం
పరలోక తండ్రినడిగిన మంచి ఈవులీయకుండునా (2) కరములెత్తి ప్రార్థించినా దీవెనలు కురియకుండునా (2) ||జీవముగల||
2వ చరణం
సృష్టి కర్త అయిన ప్రభువుకు మన అక్కర తెలియకుండునా సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా (2) ||జీవముగల||
3వ చరణం
సర్వశక్తుడైన ప్రభువుకు సాధ్యము కానిదుండునా తన మహిమ కనపరచుటకు దయ చేయక ఊరకుండునా