♪♫
TG-3358
Telugu
ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా
Enno Enno Melulu Chesaavayyaa
0
views
పల్లవి
ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా (2) హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2) ||ఎన్నో||
1వ చరణం
బాధలలో మంచి బంధువువైనావు వ్యాధులలో పరమ వైద్యుడవైనావు (2) చీకటి బ్రతుకులో దీపము నీవై పాపములన్నియు కడిగిన దేవా (2) నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2) ||ఎన్నో||
2వ చరణం
శోధనలో సొంత రక్షకుడైనావు శ్రేష్ట ప్రేమ చూపు స్నేహితుడైనావు (2) హృదయ వేదన తొలగించినావు కృపా క్షేమముతో నడిపించినావు (2) నా కోసం భువికొచ్చిన దైవ మానవా నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2) ||ఎన్నో||