TG-5250
Telugu

నాదు దేవా నాదు దేవా నన్నేల విడనాడితివయ్యా

Naadu Deevaa Naadu Deevaa Nanneela Vidanaadithivayyaa

0
views
పల్లవి

నాదు దేవా నాదు దేవా - నన్నేల విడనాడితివయ్యా అను పల్లవి: నన్ను రక్షింపక ఆర్తధ్వని - వినక నీవేల దూరమున్నావు? 1.  రాత్రింబగళ్ళు మొఱ్ఱబెట్టగా - ఏల నుత్తరమీయకున్నావు ఇశ్రాయేలు స్తోత్రముపై కూర్చున్న - పరిశుద్ధ దేవుడవై యున్నావు 2.  మా పితరులు నీయందు - విశ్వసించగా రక్షించితివి మొఱలిడి నిన్ను నమ్మిరి - విడుదలొంది సిగ్గునొందలేదు 3.  నరుడను కాను పురుగును - నరులచే నిందింపబడితి నరులచే తృణీకారము - పొందియున్న వాడనైతిని 4.  నన్ను జూచు వారెల్లరు - తమ పెదవులను విరిచి తలల నాడించుచున్నారు - నన్నపహసించుచున్నారు 5.  యెహోవాపై భారముంచుము - తాను నిన్ను విడిపించునేమో వాడాయన కిష్టుడు కాడా - వాని తప్పించునేమో యందురు 6.  గర్భమునుండి నన్ దీసిన వాడా - నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కాదా - నాకు నమ్మిక పుట్టించితివి 7.  గర్భవాసినైనది మొదలు - నుండి నా కాధారము నీవే నన్ను దల్లి కనిన నాటి - నుండి నా దేవుడవు నీవే