నాదు ప్రాణమా నాదు ప్రాణమా
Naadu Praanamaa Naadu Praanamaa
నాదు ప్రాణమా నాదు ప్రాణమా దేవుని క్రియల్మరువకుమా ఆయన చేసిన దేనిన్ మరువకుమా 1. వ్యర్థుడనై నాశనంబౌ నిన్ను రక్షించి మోక్షనగరు చేర్చను తనదు ప్రాణమిచ్చెనే ఓ నా మనసా యెంతటి ప్రేమా దేవుని క్రియల్మరువకుమా - నీ 2. ప్రియులులేక భ్రమసి నీవు పరుడవైనపుడు ప్రయుడేసు నిన్ను జేరి సంతసంబిడెనే సమర్పించు సర్వము తనకే దేవుని క్రియల్మరువకుమా - నీ 3. రక్షణాలం కారవస్త్రము జీవాహారము శాంతి సమాధానము నీతి నీకు నిచ్చెనే ప్రేమ పరిమళ స్తుతులను పాడి దేవుని క్రియల్మరువకుమా - నీ 4. గెత్సేమనెలో కార్చె నేసు రక్త చెమటలను వేదనతో విజ్ఞాపనము నీ కొరకు చేసెన్ వినుమా మనసా యేడ్చెను నీకై దేవుని క్రియల్మరువకుమా - నీ 5. వచ్చెదననిన కాలమాయె తామసం బేల పభుని రాక బూరధ్వనించు కాలమెప్పుడో ఆశతో ప్రభుని రాకడకోరి దేవుని క్రియల్మరువకుమా – నీ
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.