నాదు జీవితము మారిపొయినది
Naadu Jeevithamu Maaripoyinadi
నాదు జీవితము మారిపొయినది నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా ||నాదు||
చాలునయ్యా దేవా – ఈ జన్మ ధాన్యమే ప్రభువా (2) పాప కూపము విడిచి – నీ దారి నడచితి దేవా నిన్నాశ్రయించితి ప్రభువా ||నాదు||
కన్ను గానని దిశగా – బహు దూరమేగితినయ్యా (2) నీ ప్రేమ వాక్యము వినగా – నా కళ్ళు కరిగెను దేవా నిన్నాశ్రయించితి ప్రభువా ||నాదు||
లోకమంతా విషమై – నరకాగ్ని జ్వాలలు రేగే (2) ఆ దారి నడపక నన్ను – కాపాడినావని దేవా నిన్నాశ్రయించితి ప్రభువా ||నాదు||
జాలిగల నా ప్రభువా – నీ చేయి చాపవా ప్రభువా (2) చేరగల నీ దరికి – నే పాపినయ్యా ప్రభువా నే పాపినయ్యా ప్రభువా ||నాదు||
ఆరిపోని జ్యోతివై – కన్నులలోని కాంతివై (2) ఎంత కాలముంటివి – ఎంతగా ప్రేమించితివి నన్నెంతగా ప్రేమించితివి ||నాదు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.