♪♫
TG-4713
Telugu
ఎంత ప్రేమ యెంత ప్రేమ యెంత ప్రేమయా
Entha Preema Yentha Preema Yentha Preemayaa
0
views
పల్లవి
ఎంత ప్రేమ యెంత ప్రేమ యెంత ప్రేమయా దేవుఁడెంత గొప్ప ప్రేమయై వెలుంగుచుండునే ||ఎంత||
1వ చరణం
1. ఎంత లోతు ఎంత నిడివి యెంత విరివయా దాని నింత యంతయని వచించు మనుజుఁ డెవ్వఁడు ||ఎంత||
2వ చరణం
2. మనమునఁ దలపోయ నూహకంద దెంతయున్ దానిఁ జనువుఁగ జగమందుఁ బొగడ మాట లందవే ||ఎంత||
3వ చరణం
3. దేవదూతలైన దానిఁ బాడలేరట యింక దేవుఁడే తన సుతు నొసంగి ఇంత యది యనెన్ ||ఎంత||
4వ చరణం
4. ఇంత గొప్ప ప్రేమఁ జూప నూరకుందునే ప్రభు జెంతఁజేరి సంత తంబు ప్రీతిఁ జేసెదన్ ||ఎంత||