TG-3834
Telugu

నన్ను పిలచిన దేవా

Nannu Pilachina Devaa

0
views
పల్లవి

నన్ను పిలచిన దేవా – నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయ్యా (2) నే జీవించునది నీ కృప – ఎదుగించునది నీ కృప హెచ్చించునది నీ కృప మాత్రమే (2) నీ కృపయే కావలెను – నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా (2) యేసయ్యా … ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు తొట్రిల్లి నడిచినప్పుడు ఆదుకొన్నవారు లేరు (2) బిగ్గరగా ఏడిచినప్పుడు కన్నీరు తుడిచె కృప (2) నీ కృప లేకుంటేనే నేను లేను నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే||

1వ చరణం

నేనని చెప్పుటకు నాకేమి లేదు సామర్థ్యం అనుటకు నాకని ఏమి లేదు (2) అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప (2) నీ కృప లేకుంటేనే నేను లేను నీ కృప లేకుంటేనే నేనేమి లేను ||నీ కృపయే||