TG-4871
Telugu

గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము

Geethan Geethan Jaya Jaya Geethan Cheeyi Thatti Paadedamu

0
views
పల్లవి

గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము (2) యేసు రాజు లేచెను హల్లెలూయ జయ మార్భటించెదము (2) ||గీతం||

1వ చరణం

చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెను అందు వేసిన ముద్ర కావలి నిల్చెను దైవ సుతుని ముందు ||గీతం||

2వ చరణం

వలదు వలదు యేడువవలదు వెళ్ళుడి గలిలయకు తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి ||గీతం||

3వ చరణం

అన్న కయప వారల సభయు అదరుచు పరుగిడిరి ఇంక దూత గణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి ||గీతం||

4వ చరణం

గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి జయ వీరుడు రాగా మీ మేళతాళ వాద్యముల్ బూర లెత్తి ధ్వనించుడి ||గీతం||