TG-4485
Telugu

Yesu Entho Varaala -యేసూ ఎంతో వరాల

Yesu Entho Varaala

0
views
పల్లవి

యేసూ.. ఎంతో వరాల మనస్సూ నీది చిత్ర చిత్రాలుగా విన్నానయ్యా ఊసు ప్రభువా హైలెస్సా – నీ మనసు హైలెస్సా – (2) ||యేసూ||

1వ చరణం

గాలి వానొచ్చి నడి యేటిలోన నావ అల్లాడగా – నీవే కాపాడినవే హో.. కంట చూడంగ గాలాగిపోయే అలలే చల్లారెనే – మహిమ చూపించావే (2) నీవే రేవంట ఏ నావకైనా కడలే నీవంట ఏ వాగుకైనా (2) ఉప్పొంగె నీ ప్రేమలో ||ప్రభువా||

2వ చరణం

దిక్కు లేనట్టి దీనాత్ములంటే నీలో కలిగే దయ – నాడే తెలిసిందయ్యా ఆ.. జంతు బలులిచ్చే మూడాత్ములంటే నీలో కలిగే దయ – నాడే తెలిసిందయ్యా (2) నిన్ను పొగడంగ నేనెంత వాడ నీటి మడుగులలో చేపంటి వాడ (2) నా దారి గోదారిలో ||ప్రభువా||