TG-3413
Telugu

ఘనమైనవి నీ కార్యములు

Ghanamainavi Nee Kaaryamulu

0
views
పల్లవి

ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2) కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్నివేళలా (2) అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి||

1వ చరణం

యే తెగులు సమీపించనీయక – యే కీడైన దరిచేరనీయక ఆపదలన్ని తొలగే వరకు – ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2) నా భారము మోసి – బాసటగా నిలిచి – ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము ||ఘనమైనవి||

2వ చరణం

నాకు ఎత్తైన కోటవు నీవే – నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైన బండవు నీవే – శాశ్వత కృపకాధారము నీవే (2) నా ప్రతిక్షణమును నీవు – దీవెనగా మార్చి – నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము ||ఘనమైనవి||

3వ చరణం

నీ కృప తప్ప వేరొకటి లేదయా – నీ మనసులో నేనుంటే చాలయా బహు కాలముగా నేనున్న స్థితిలో – నీ కృప నా యెడ చాలునంటివే (2) నీ అరచేతిలో నను – చెక్కుకుంటివి – నాకేమి కొదువ ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ||ఘనమైనవి||