TG-5519
Telugu

బాధ ఉందని బ్రతకలేనని నీకు నీవే మోసపోతూ

Baadha Undani Brathakaleenani Neeku Neevee Moosapoothoo

0
views
పల్లవి

బాధ ఉందని - బ్రతకలేనని నీకు నీవే మోసపోతూ బ్రతుకుచుంటివా ప్రేమ విఫలమై - చావు మేలని ఉరి కోయ్యకు నిన్ను ఎక్కించుకుంటావా నవ మాసాలు మోసే తల్లి ప్రేమ మరిచి పెంచిన తండ్రిని విడిచి - వెళ్ళిపోతావా దేహంతో దేవుని పని ఉందని మరిచి కట్టె విడిచి నరకంలో కాలిపోతావా ||బాధ ఉందని - బ్రతకలేనని||

1వ చరణం

పంటలు పండకుంటే ప్రాణం ఇవ్వాలా ప్రాణంకు ఉన్న విలువ - గుర్తించలేవా పరీక్ష ఫెయిల్ అయితే చంపుకోవాలా దేహం ఎంత గొప్పదో గుర్తించరాదా ఎంత వేల ఇచ్చిన ప్రాణం తిరిగి వచ్చునా అవయవాలు అమ్మే దుఖానాలున్నాయా దేహం వెనుక కష్టం - దేవునిది లేదా అవయవాలన్నీ తను చేయలేదా ప్రాణంకు విలువ ఇచ్చే జీవులను చూడు ఎన్ని శ్రమలు ఉన్న - ప్రాణం తీసుకోవు దేవుడిచ్చిన ప్రాణం వృధా చేస్తావా కలకాలం కాలుటకు - తొందర పడతావా ||బాధ ఉందని - బ్రతకలేనని||

2వ చరణం

బిడ్డ బరువైతే తల్లి మోయాలి అది నొప్పులు వద్దంటే బిడ్డ - ఎక్కడున్నది నష్టంలోనే అనుభవం ఉన్నది కష్టం లేకుంటే విజయమెక్కడున్నది చీకటి వెనక వెలుగు వస్తూ ఉంటుందిగా వెలుగు కొరకు చీకటిని భరింయించాలిగా కంటిలో నలుసు పడితే కన్నీరు తియ్యదా హృదయంలో వేదనలు - ప్రభువు తీయలేడా అడగకుండానే అన్ని ఇచ్చేవాడు బాధలలో నీకు గుర్తు రాలేదా పాపులు కోసమే ప్రాణమిచ్చినాడు ప్రార్థిస్తే ఏదైనా నీకు చేయలేడా ||బాధ ఉందని - బ్రతకలేనని||