♪♫
TG-5523
Telugu
బెత్లహేములో పశుల పాకలో నజరేతు అను ఊరిలో
Bethlaheemuloo Pashula Paakaloo Najareethu Anu Ooriloo
0
views
పల్లవి
బెత్లహేములో పశుల పాకలో - నజరేతు అను ఊరిలో (2) యేసయ్య జన్మించినాడురా దావీదు పట్టణము నందునా (2) రారండి వేడుక చేద్దాం లోక రక్షకుడు వచ్చాడని రారాజు జన్మించాడని (2) కన్య మరియ గర్భమందునా - బాలయేసు జన్మించెను (2) దీనులను కరుణించుటకు - పాపులను రక్షించుటకు గొప్ప దేవుడు నీతిమంతుడు - పాపం ఎరుగని పరిశుద్ధుడు మన రాజుల రాజు యేసు దేవుడు పరిశుద్ధాత్మతో జన్మించెను ||రారండి||
1వ చరణం
దైవ తనయుడు యేసు - మనలను రక్షించవచ్చెను. ఈ లోకాన్ని వెలిగించుటకు - గొప్ప రక్షణను మనకిచ్చుటకు (2) ప్రేమమయుడు కరుణామయుడు - జాలి గల దైవం అరుదించెను పరమ వైద్యుడు పావనుడు మనుజావతారుడై ఉదయించెను (2) ||రారండి||