♪♫
TG-5520
Telugu
బెత్లహేము ఊరిలోన పశువుల శాలలోన
Bethlaheemu Ooriloona Pashuvula Shaalaloona
0
views
పల్లవి
బెత్లహేము ఊరిలోన - పశువుల శాలలోన శ్రీ యేసు జన్మించాడు - రక్షణ భాగ్యం తెచ్చాడు (2) మనసారా ఆరాధిస్తూ - పాటలు పాడేదం రారాజు పుట్టాడని - సందడి చేసేదం (2) దివినేలే రారాజు - భువిలోన పుట్టాడు లోకానికే సంభరం - గతిలేని మన కొరకు స్థితి విడిచి పెట్టాడు - ఆహా ఎంతటి భాగ్యము (2) చింతలేదు - బెంగలేదు యేసయ్య తోడుగా ఇమ్మానుయేలుగా - ఇశ్రాయేలు దేవునిగా (2) అనుదినము బలపరిచి నడిపిస్తాడు చింతలన్నీ తొలగించి ఆదరిస్తాడు(2) ||దివినేలే||
1వ చరణం
వ్యాధిఅయిన బాధఅయినా - శోధన మరి ఏదైనా కన్నీటి లోయలో - కృంగిన వేళలో (2) స్వస్థ పరిచి నిన్ను విడిపిస్తాడు సమాధాన కర్తగా శాంతినిస్తాడు (2) ||దివినేలే||
2వ చరణం
పాపులను రక్షింప -ప్రభు యేసు జన్మించే శాపమును తొలగింప - నరునిగ అరుదించే (2) యేసయ్యకు నీ హృదయం అర్పించితే నిజమైన శాంతి సమాధానమే (2) ||దివినేలే||