TG-3505
Telugu

జీవము గల దేవుని సంఘం

Jeevamu Gala Devuni Sangham

0
views
పల్లవి

జీవము గల దేవుని సంఘం – ఎంతో ఎంతో రమ్యము మనకై దేవుని సంకల్పం – ఎంతో ఎంతో శ్రేష్ఠము సంకల్పమందున మనముండినా ఆ సంఘమందున వసియించినా ఎంతో ఎంతో ధన్యము – (2) ||జీవము||

1వ చరణం

యేసే స్వరక్తమిచ్చి – సంపాదించిన సంఘము సత్యమునకు స్థంభమును – ఆధారమునైయున్నది (2) పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువవు (2) ||జీవము||

2వ చరణం

యేసే శిరస్సైయున్న – శరీరము మనమందరము పరిశుద్ధాత్మ మనలో – నివసించుచున్నాడు (2) ఏ నరుడు దేవుని నిలయమును పాడు చేయకూడదు (2) ||జీవము||

3వ చరణం

యవ్వన ప్రాయము మనలో – భవ్యానికి భయపడక సవ్వడి చేయుచు నిరతం – కవ్వించు చుండును (2) ప్రభు యేసు దివ్య మాదిరిలో గమ్యము చేరగా సాగుదాం (2) ||జీవము||

4వ చరణం

ఏ ప్రాంతీయుల మైన – మనమందరము సోదరులం శాశ్వత రాజ్యపు గురిలో – శ్రీ యేసుని సహ వారసులం (2) లోకాన యేసుని త్యాగమును – సాహసముతో చాటుదాం లోకాన క్రీస్తుని మహిమను – సహనముతోనే చాటుదాం ||జీవము||