TG-206
Telugu

కరుణసాగర వీవేకావా మరణమొంద సిల్వ

karunnasaagara veeveekaavaa marannamonda silva

197
views
పల్లవి

కరుణసాగర వీవేకావా మరణమొంద సిల్వ మెట్టకు మోసినావా కరుణ సాగర వీవెకావ మరియు కల్వరి మెట్టమీఁదను కడకు మేకులుఁ గొట్టబడి నీ మరణరక్తము చేత నరులకు పరమరక్షణఁ దెల్పినావా ||కరుణసాగర వీవేకావా||

1వ చరణం

నజరేతు పుర విహారా నరులఁ బ్రోవ నరు దెంచినావా నజరేతు పురవిహారా ప్రజలపాపముఁ బరిహరించియు ప్రజల సద్గతి నొందఁ జేయను విజయమునుఁ బొందితివి యిలలో సజనులందరు భజనసేయఁ గ ||కరుణసాగర వీవేకావా||

2వ చరణం

మరియయనే కన్యకుమారా నరకబాధఁ దప్పించినావా మరియయనే కన్యకుమారా మార్గసత్యము జీవనములీ మహిని నమ్మిన వారి కెల్లను మీరెగాకిఁక వేరేలేరని సారెసారెకుఁ జెప్పినావా ||కరుణసాగర వీవేకావా||

3వ చరణం

మహిలోను మనుజకుమారా యహా తండ్రిని వేడినావా మహిలోను మనజకుమారా యిహములోనిను నమ్మువారిని బహు నీ కటాక్షంబుచేతను మహిమజనకా గావుమనుచు త్రాహియని బ్రార్ధించి నావా ||కరుణసాగర వీవేకావా||

4వ చరణం

పరమతండ్రి ప్రియకుమారా పావనముజేయ మీరేకారా పరమతండ్రి ప్రియకుమారా పరముడా నీ పంచగాయము లరయగా రక్తముతో నిండెను ధరను మా పాపములుఁ గడుగను చిరముగా ను త్త రమునాయె ||కరుణసాగర వీవేకావా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.