TG-4843
Telugu

ఖండింపవలెను దుర్గుణములు ఖండింపవలెను

Khandinpavalenu Durgunamulu Khandinpavalenu

0
views
పల్లవి

ఖండింపవలెను దుర్గుణములు ఖండింపవలెను ఖండింపవలెఁ బాప ముండఁజూచి యేసు నండఁజేరి మన గుండె పదిలముఁ జేసి ||ఖండింప||

1వ చరణం

1.  అంధత్వమునను రక్షణమార్గ మందుఁ జేరకయు ఎందెందుఁ జూ చిన సందులేక పాప మందు మునిఁగి నరలా నందమోందక చెడిరి ||ఖండింప||

2వ చరణం

2.  ఎందు కీ భ్రమలు నీ యందుండు సందేహము వీడు పొందుగ యేసు సం బంధు డవై యున్న నందమైన మోక్ష మందుఁ జేరుట కొఱకు ||ఖండింప||

3వ చరణం

3.  బెదరక నీవు సాతానుని నెదిరింపవలెను కుదురుగ నీ యేసు చదరునఁ జేరిన వదరుబోతు లెల్ల నెదురాడ లేరిఁక ||ఖండింప||

4వ చరణం

4.  ఆసింపబోకు లోకభోగములు మోసమై యుండు వాసిగ యేసుని దాసుఁడవైయున్న గాసిఁ జెందక మోక్ష దాసుఁడ వౌదువు ||ఖండింప||

5వ చరణం

5.  నమ్మి జీవించు యేసుని యందు నెమ్మదిఁ బొందు రమ్ము యేసుని యొద్ద సొమ్ము నీకున్నది సమ్మతించి మదిని నెమ్మదిగాఁ జూచి ||ఖండింప||