కోలాహలముగఁ గూరిమితోఁ గూడి
Koolaahalamugan Goorimithoon Goodi
కోలాహలముగఁ గూరిమితోఁ గూడి కోలాటమాడను రా రా మా పాలిటి యేసుని పేరఁ మాపాలిటి యేసుని పేర మ మ్మేలెడి దేవుని పేరఁ ||కోలాహలముగ||
1. మా సామి యా మోక్ష వాసుండు నైనట్టి యేసయ్య పోకను జూడు మా యేసయ్యరాకను బాడు యేసయ్య రాకను బాడు నీ హోసన్న యని మదివేడు ||కోలాహలముగ||
2. పాపంబులన్ మోసి ప్రాణంబు బలి యిచ్చి తాఁ బరమున కేగలేదా నీ జ్ఞాపకములోనికి రాదా జ్ఞాపకములోనికి రాదా నీ ప్రాపకుఁడై యుండలేదా ||కోలాహలముగ||
3. ఏలినవాడైన యేసుని రాకను నాలించి చూడవదేర నిను పాలించు వాడనుకోర పాలించువాడనుకోర పరి శీలించువాడనుకోర ||కోలాహలముగ||
4. అంతములో భువి కా యేసునాధుండు చెంతను దూతలతోడ బల్ వింతగ వచ్చును జూడ వింతగ వచ్చును జూడ న త్యంత బలముతోడ రాఁడ ||కోలాహలముగ||
5. ఆకాశ భూమ్యాదు లార్భటిలు దూతల మూకలతోఁ గూడినాఁడు ఈ లోకాని కేతెంచుఁవాడు లోకాని కేతెంచువాఁడు ఇఁక వీకతోఁ బ్రభుని బాడు ||కోలాహలముగ||
6. భీకర సింహపు టాకారముతోను ఢీకొని మేఘములతోడ బల్ బాకారవంబులు బాడ బాకారంబులు బాడ నిటు ఢీకొని వచ్చెను జూడ ||కోలాహలముగ||
7. భాసురమైనట్టి యేసయ్య రాకను ఈ సూర్యుఁడు జూడలేఁడు తన వి కాసము జీఁకటౌను వి కాసము జీఁకటౌను నీ కా సుగతిఁ జూపువాఁడు ||కోలాహలముగ||