♪♫
TG-3592
Telugu
క్రీస్తులో జీవించు నాకు
Kreesthulo Jeevinchu Naaku
0
views
పల్లవి
క్రీస్తులో జీవించు నాకు – ఎల్లప్పుడు జయముండును జయముంది జయముంది – జయముంది నాకు (2) ఎటువంటి శ్రమలొచ్చినా – నేను దిగులు పడను ఇలలో (2) ఎవరేమి చెప్పిననూ – నేను సోలిపోనెప్పుడూ (2) ||జయముంది||
1వ చరణం
నా రాజు ముందున్నాడు – గొప్ప జయముతో వెళ్లుచున్నాడు (2) మట్టలను చేత పట్టి – నేను హోసన్నా పాడెదను (2) ||జయముంది||
2వ చరణం
సాతాను అధికారమున్ – నా రాజు తీసివేసెను (2) సిలువలో దిగగొట్టి – యేసు కాళ్లతో త్రొక్కి వేసెను (2) ||జయముంది||