TG-5150
Telugu

నా కోసమా ఈ సిలువ యాగము

Naa Koosamaa Ee Siluva Yaagamu

0
views
పల్లవి

నా కోసమా ఈ సిలువ యాగము నా కోసమా ఈ ప్రాణ త్యాగము (2) కల్వరిలో శ్రమలు నా కోసమా కల్వరిలో సిలువ నా కోసమా (2) ||నా కోసమా||

1వ చరణం

నా చేతులు చేసిన పాపానికై నా పాదాలు నడచిన వంకర త్రోవలకై (2) నీ చేతులలో... నీ పాదాలలో... నీ చేతులలో నీ పాదాలలో మేకులు గుచ్చినారే (2) యేసయ్యా నాకై సహించావు యేసయ్యా నాకై భరించావు (2) ||నా కోసమా||

2వ చరణం

నా మనస్సులో చెడు తలంపులకై నా హృదిలో చేసిన అవిధేయతకై (2) నీ శిరస్సుపై... నీ శరీరముపై... నీ శిరస్సుపై నీ శరీరముపై ముళ్ళను గుచ్చినారే (2) యేసయ్యా నాకై సహించావు యేసయ్యా నాకై భరించావు (2) ||నా కోసమా||