ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము
Evari Kosamo Ee Praana Thyaagamu
ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము (2) నీ కోసమే నా కోసమే కలువరి పయనం – ఈ కలువరి పయనం (2) ||ఎవరి||
ఏ పాపము ఎరుగని నీకు – ఈ పాప లోకమే సిలువ వేసిందా ఏ నేరము తెలియని నీకు – అన్యాయపు తీర్పునే ఇచ్చిందా (2) మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతో నడువలేని నడకలతో తడబడుతూ పోయావా సోలి వాలి పోయావా…. ||ఎవరి||
జీవకిరీటం మాకు ఇచ్చావు – ముళ్ళ కిరీటం నీకు పెట్టాము జీవ జలములు మాకు ఇచ్చావు – చేదు చిరకను నీకు ఇచ్చాము (2) మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా నీ ప్రక్కలో బళ్ళెముతో – ఒక్క పోటు పొడిచితిమి తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు వీరిని క్షమించు, వీరిని క్షమించు అని వేడుకొన్నావా… పరమ తండ్రిని ||ఎవరి||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.