♪♫
TG-3382
Telugu
ఎట్టి వాడో యేసు
Etti Vaado Yesu
0
views
పల్లవి
ఎట్టి వాడో యేసు – ఎన్ని వింతలు తనవి వట్టి నరుడు కాడు – పట్టి చూడ ప్రభుని – (2) ||ఎట్టి||
1వ చరణం
గాలి సంద్రాలను – గద్ధింపగా యేసు (2) హద్దు మీరక ఆగి – సద్దుమణిగిపోయే (2) ||ఎట్టి||
2వ చరణం
పక్షవాతపు రోగిని – తక్షణమే లెమ్మనగా (2) పరుపెత్తుకొని లేచి – పరుగెత్తికొనిపోయె (2) ||ఎట్టి||
3వ చరణం
పట్టు యేసుని పాదం – తట్టు దేవుని ద్వారం (2) కట్టు ఇక నీ పాపం – నెట్టు నిను పరలోకం (2) ||ఎట్టి||