♪♫
TG-3386
Telugu
ఎవరికి ఎవరు ఈ లోకంలో
Evariki Evaru Ee Lokamlo
0
views
పల్లవి
ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో (2) ||ఎవరికి||
1వ చరణం
ఎవరెవరో ఎదురౌతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు (2) కష్టాలలో వారు కదిలి పోతారు కరుణగల యేసు నాతో ఉంటాడు (2) ||ఎవరికి||
2వ చరణం
ధనము నీకుంటే అందరు వస్తారు దరిద్రుడవైతే దరికెవ్వరు రారు (2) ఎవరిని నమ్మిన ఫలితము లేదురా యేసుని నమ్మితే మోక్షం ఉందిరా (2) ||ఎవరికి||
3వ చరణం
మనుషుల సాయం వ్యర్ధమురా రాజుల నమ్మిన వ్యర్ధమురా (2) యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు.. ఎంతో మేలు (2) ||ఎవరికి||