♪♫
TG-3751
Telugu
నా మనస్సా ఆయన
Naa Manassaa Aayana
0
views
పల్లవి
నా మనస్సా ఆయన మరచునా దేవుడు నిన్ను మరచిపోవునా (2) ఆయనే నీ బాధలన్ని కనుమరుగు చేయునే ఆనంద తైలము నీపై కుమ్మరించునే (2) స్తుతింపజేయునే – నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే (2) నిట్టూర్పు శబ్దము విన్న – నీ హద్దులన్నిటిలో సమృద్ధి గానాలెన్నో – ఇది మొదలు వినబడునే (2) తరిగిపోను నేను – అణగార్చబడను నేను (2) ||స్తుతింపజేయునే||
1వ చరణం
సరిచేయు వాడే – ఓ ….స్థిరపరచినాడే బలపరచినాడే – పూర్ణుణ్ణి చేయునే సరి చేసి నిన్ను – హెచ్చించిన ప్రభువు ఈ నూతనవత్సరములో – అలంకరించునే… విచారించే వారు లేక – ఒంటరైయున్న నీకు ఆరోగ్యము దయచేసి – పరిపాలన నిచ్చునే (2) కూలిన కోటను – రాజగృహముగా మార్చును (2) ||స్తుతింపజేయునే||