♪♫
TG-3334
Telugu
ఎలా మరువగలనయ్యా
Elaa Maruvagalanayyaa
0
views
పల్లవి
ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను ఎలా విడువగలనయ్యా నీ సేవను (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ఎలా మరువగలనయ్యా||
1వ చరణం
ఆత్మీయులే నన్ను ఆదరించలేదు ప్రేమించువారే ప్రేమించలేదు (2) ఆదరించావు ప్రేమించావు (2) అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు (2) ||ఎలా మరువగలనయ్యా||
2వ చరణం
బంధువులే నన్ను ద్వేషించినారు సొంత తల్లిదండ్రులే వెలివేసినారు (2) చేరదీసావు సేదదీర్చావు (2) అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు (2) ||ఎలా మరువగలనయ్యా||
3వ చరణం
అనాథగా నేను తిరుగుచున్నప్పుడు ఆకలితో నేను అలమటించినప్పుడు (2) ఆదరించావు ఆకలి తీర్చావు (2) అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు (2) ||ఎలా మరువగలనయ్యా||