♪♫
TG-3329
Telugu
ఏగెదను నే చేరెదన
Egedanu Ne Cheredanu
22
views
పల్లవి
ఏగెదను నే చేరెదను సీయోనును నే చూచెదను (2) విశ్వాస కర్తయైన నా యేసూ (2) నీ సముఖములో నే మురిసెదను నీ కౌగిలిలో ఉప్పొంగెదను (2) జీవ కిరీటమును నే పొందెదను ||ఏగెదను||
1వ చరణం
భూదిగంతములకు నీ కాడిని – నే మోయుచున్నాను యేసూ నీ యొద్దనే నాకు – విశ్రాంతి దొరుకును (2) దినదినము నాలో నే చనిపోవుచున్నాను అనుదినము నీలో బ్రతుకుచున్నాను (2) అనుదినము నీలో బ్రతుకుచున్నాను ||ఏగెదను||
2వ చరణం
నా ఆత్మీయ పోరాటములో దేవా – నీవే నా కేడెము సదా నిన్నే నేను ధరియించి – సాగిపోవుచున్నాను (2) మంచి పోరాటముతో నా పరుగును కడముట్టించి జయమొందెదను (2) విశ్వాసములో జయమొందెదను ||ఏగెదను||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.