TG-5199
Telugu

నా నిమిత్తమాయన మహిని శ్రమలు పొందెను

Naa Nimiththamaayana Mahini Shramalu Pondenu

0
views
పల్లవి

నా నిమిత్తమాయన మహిని శ్రమలు పొందెను ఘనధనముల రోసెను అనుమతించె చావుకు 1.  నా నిమిత్తమె మరణ మాయెను తన జీవమును నాకు బలిగా ధారపోసెను ||నా నిమి||

1వ చరణం

2.  గొఱ్ఱెపిల్ల రీతిగా గొప్ప శాంతి జూపెను ఉర్వినంత మోపినన్ యోర్చె మౌనవృత్తిని ||నా నిమి||

2వ చరణం

3.  అతడు దోషమెరుగడు అతడు కపటమెరుగడు అయినను దేవుడు అతని నలుగగొట్టెను ||నా నిమి||

3వ చరణం

4.  అతడు యిలను పొందిన అధిక దెబ్బలవలన్ క్షితిని నాకు కలిగెను స్వస్థత మది రూఢీగా ||నా నిమి||

4వ చరణం

5.  రోగముల్ భరించెను వ్యసనములు వహించెను బాగుగా నొత్తిడిన్ బాధలన్ సహించెను ||నా నిమి||

5వ చరణం

6.  గాయములను పొందెను కాయమంత నొచ్చెను హేయమైన నిందలన్ ఎలమిలో సహించెను ||నా నిమి||

6వ చరణం

7.  ఎదిగె నాయన మన యెడల దీన వృత్తిని సదనులమగు ప్రీతితో సరకు చేయమైతిమి ||నా నిమి||

7వ చరణం

8.  తన యనుభవమున్ మనల దోషరహితులన్ చేయ నుద్దేశించెన్ ప్రాణమర్పించెను ||నా నిమి||