TG-3181
Telugu

భూమియు దాని సంపూర్ణత

Bhoomiyu Daani Sampoornatha

17
views
పల్లవి

భూమియు దాని సంపూర్ణత లోకము దాని నివాసు లెహోవావే (2) ఆయన సముద్రము మీద దానికి పునాది వేసెను (2) ప్రవాహజలముల మీద దానిని స్థిరపరచెను (2) ||భూమియు||

1వ చరణం

యెహోవా పర్వతమునకు నెక్కదగిన వాడెవ్వడు (2) యెహోవా పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవ్వడు (2) ||భూమియు||

2వ చరణం

వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు (2) నిర్దోషచేతులు శుద్ధ హృదయము కలిగినవాడే (2) ||భూమియు||

3వ చరణం

నిన్నాశ్రయించి నీ సన్నిధిని వెదకెడి వాడు (2) వాడాశీర్వాదము నీతి మత్వము నొందును (2) ||భూమియు||

4వ చరణం

గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి పురాతనమైన తలుపులారా (2) మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి (2) ||భూమియు||

5వ చరణం

మహిమగల యీ రాజెవడు? బలశౌర్యముగల ప్రభువే (2) యుద్ధశూరుడైన యెహోవా పరాక్రమముగల ప్రభువే (2) ||భూమియు||

6వ చరణం

మహిమగల యీ రాజెవడు? సైన్యముల యెహోవాయే (2) ఆయనే యీ మహిమగల రాజు హల్లెలూయా ఆమెన్ (2) ||భూమియు||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.