భీకరుండౌ మా యెహోవా
Bheekarundau Maa Yehovaa
భీకరుండౌ మా యెహోవా – పీఠ మెదుటన్ గూడరే ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొనియాడరే ||భీకరుండౌ||
మట్టితోనే మమ్ము నెల్ల – మానవులుగ సృజించెను ఇట్టి శక్తుండౌ ప్రభున్ మే-మెచ్చుగా మది నెంతుము ||భీకరుండౌ||
ఏరితోడు లేక మము స-ర్వేశ్వరుడు సృష్టించెను ధారుణిన్ దానొక్కడే మా – దైవమని పూజింతుము ||భీకరుండౌ||
పుట్టగిట్టన్ జేయ దానై – నట్టి దేవుని శక్తిని బట్టుగా లోకస్తులారా – ప్రస్తుతింపరే భక్తిని ||భీకరుండౌ||
మేటి సంగీతంబులపై – మింట నారవ మొందను జాటరే వేవేల నోళ్ళన్ – సన్నుతుల్ ప్రభు వందను ||భీకరుండౌ||
మిక్కిలి కష్టంబులతో – మిత్తికిని బాల్పొందను దిక్కు లేని గొర్రెలట్లు – దిరుగ జేర్పన్ మందను ||భీకరుండౌ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.