నాకేమి కొదువ నాధుఁడుండ
Naakeemi Koduva Naadhundunda
నాకేమి కొదువ నాధుఁడుండ నిఁక శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ట పాలకుఁడు నా యేక రక్షకుఁడు గనుక ||నాకేమి||
1. తనివి దీర మేళ్లనుభవింప నేను నను సదా మేళ్లనెడి పచ్చిక నదిమి మృదువుగఁ బండు కొనఁజేయును గనుక ||నాకేమి||
2. ఎంత శోధన యెండ యున్న నాకు నెంతకు నోరిగర దెపుదు శాంత జలములు నా చెంతనే యుండు గనుక ||నాకేమి||
3. తప్పిపోయిన నన్ దారిం బెట్టి నన్ను తెప్పరిల్లఁజేసి నాకుఁ దీరు నలసటను నా తప్పు మన్నించున్ కనుక ||నాకేమి||
4. నీతి మార్గమునన్ నిల్పున్ నన్ను ప్రభువు నీతి లేని నాకుఁ దనను నీతి దయ చేయున్ స్వ నీతిని ద్రుంచున్ గనుక ||నాకేమి||
5. చావు చీఁకట్ల శక్తియుండు ఆహా లోయలోఁబడి పోవలసినను నే వెరవకుందు నా దేవుండే తోడు గనుక ||నాకేమి||
6. మీఁదఁబడునట్టి శోధనలన్ ధరను నా దరికి రానీక దండము నన్ను బ్రోచుచును నా కాదరణ యౌను గనుక ||నాకేమి||
7. పగవారల్ సిగ్గు పడునట్లుగ నా జగము యెరుఁగని సౌఖ్యభో జన మగపరుచును హా తగినదే పెట్టున్ గనుక ||నాకేమి||
8. తన యాత్మానంద తైలంబుతో ప్రభువు ననుదినము తలయంటి విసుగ కొనక తుడుచును నా కన్నీళ్లన్ని గనుక ||నాకేమి||
9. పలువిధములైన భాగ్యములతో తండ్రి వెలుపలికి దిగవెడలునట్టి వెల గల గిన్నె నా కలిమిగాఁ జేయున్ గనుక ||నాకేమి||
10.బ్రదుకంతటన్ గృ పాక్షేమములు నా వదలకుండగ వచ్చు నాతో సుదినములు గల్గ నా పదలు సంపదలౌ గనుక ||నాకేమి||
11.దురితంబు లుండు ధరణి నాకు నిజము నిరవు కాఁదిక నెప్పటికి నా పరమ దేవుని మందిరమె నా యిల్లు గనుక ||నాకేమి||