♪♫
TG-3448
Telugu
హృదయాలనేలే రారాజు
Hrudayaalanele Raaraaju
13
views
పల్లవి
హృదయాలనేలే రారాజు యేసువా అధరాలపై నీ పేరే కదలాడుతుండగా (2) నీ కొరకే నేను జీవింతును నా జీవితమంతా అర్పింతును ||హృదయాల||
1వ చరణం
నా ప్రియులే శతృవులై నీచముగా నిందించి నన్నెంతో తూలనాడి నా చేయి వీడగా (2) నా దరికి చేరి నన్ను ప్రేమించినావా నన్నెంతో ఆదరించి కృప చూపినావా నా హృదయనాథుడా నా యేసువా నా ప్రాణప్రియుడా క్రీస్తేసువా ||హృదయాల||
2వ చరణం
నీ హృదయ లోగిలిలోన నను చేర్చు నా ప్రియుడా నీ ప్రేమ కౌగిలిలోన నను దాచు నా విభుడా (2) పరలోక మార్గాన నడిపించు నా ప్రభు అరణ్య యాత్రలోన నిన్నానుకొందును అతిలోక సుందరుడా శ్రీ యేసువా రాజాధిరాజా ఘన యేసువా ||హృదయాల||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.