♪♫
TG-3447
Telugu
హోసన్ననుచూ స్తుతి పాడుచూ
Hosannanuchu Sthuthi Paaduchu
17
views
పల్లవి
హోసన్ననుచూ స్తుతి పాడుచూ సీయోనుకు చేరెదం (2) హోసన్నా… హోసన్నా… (4) ||హోసన్ననుచూ||
1వ చరణం
ఈ లోకయాత్రలో బాటసారులం ఈ జీవన కడలిలో పరదేశులం (2) క్షణభంగురం ఈ క్షయ జీవితం అక్షయ నగరం మనకు శాశ్వతం (2) ||హోసన్నా||
2వ చరణం
మన్నయిన ఈ దేహం మహిమరూపమై ధవళవర్ణ వస్త్రములు ధరియించెదము (2) నాధుడేసుకు నవ వధువులము నీతి పాలనలోన యువరాణులము (2) ||హోసన్నా||
3వ చరణం
ప్రతి భాష్ప బిందువును తుడిచివేయును చింతలన్ని తీర్చి చెంత నిలుచును (2) ఆకలి లేదు దప్పిక లేదు ఆహా మన యేసుతో నిత్యమానందం (2) ||హోసన్నా||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.