TG-3449
Telugu

హృదయమనెడు తలుపు నొద్ద

Hrudayamanedu Thalupu Nodda

3
views
పల్లవి

హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండు నిలచి – సదయుడగుచు దట్టుచుండు – సకల విధములను (2) ||హృదయ||

1వ చరణం

పరుని బోలి నిలుచున్నాడు – పరికించి చూడ నతడు – పరుడు గాడు రక్షకుండు – ప్రాణ స్నేహితుడు (2) ||హృదయ||

2వ చరణం

కరుణా శీలుండతడు గాన – గాచి యున్నాడు యేసు – కరుణ నెరిగి గారవింప – గరము న్యాయంబు (2) ||హృదయ||

3వ చరణం

ఎంత సేపు నిలువ బెట్టి – యేడ్పింతు రతని నాత – డెంతో దయచే బిలుచుచున్నా – డిప్పుడు మిమ్ములను (2) ||హృదయ||

4వ చరణం

అతడు మిత్రుడతడు మిత్రుం – డఖిల పాపులకు మీర – లతని పిలుపు వింటి రేని – యతడు ప్రియుడగును (2) ||హృదయ||

5వ చరణం

జాలి చేత దన హస్తముల – జాపి యున్నాడు మిమ్ము – నాలింగనము సేయ గోరి – యనిశము కనిపెట్టు (2) ||హృదయ||

6వ చరణం

సాటిలేని దయగల వాడు – సర్వేశు సుతుడు తన – మాట వినెడు వారల నెల్ల – సూటిగ రక్షించు (2) ||హృదయ||

7వ చరణం

చేర్చుకొనుడి మీ హృదయమున – శ్రీ యేసునాథు నతడు – చేర్చుకొనుచు మీ కిచ్చును – చీర జీవము కృపను (2) ||హృదయ||

8వ చరణం

అతడు తప్పక కలుగజేయు – నఖిల భాగ్యములు మీర – లతని హత్తుకొందు రప్పు – డానందము తోడ (2) ||హృదయ||

9వ చరణం

బ్రతుకు శాశ్వతంబు కాదు – పరికించు చూడు గాన – బ్రతికి యుండు కాలముననే – ప్రభుని గొలువండి (2) ||హృదయ||