TG-5076
Telugu

నడిపించు నా నావా నడి సంద్రమున దేవా (99)

Nadipinchu Naa Naavaa Nadi Sandramuna Deevaa (99)

0
views
పల్లవి

- రెవ. డా. ఎ.బి. మాసిలామణి - Scale : D నడిపించు నా నావ - నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున - నా జన్మ తరియింప 1.  నా జీవిత తీరమున - నా అపజయ భారమున నలిగిన నా హృదయమును - నడిపించుము లోతునకు నాయాత్మ విరబూయ - నా దీక్ష ఫలియింప నా నావలో కాలిడుము - నా సేవ జేకొనుము ||నడిపించు||

1వ చరణం

2.  రాత్రంతయు శ్రమపడినా - రాలేదు ప్రభూ జయము రహదారులు వెదకినను - రాదాయెను ప్రతిఫలము రక్షించు నీ సిలువ - రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో - రాజిల్లు నా పడవ ||నడిపించు||

2వ చరణం

3.  ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే - అరసితి ప్రభు నీ కలిమి ఆశనిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమిగని - అల్లాడె నా వలలు ||నడిపించు||

3వ చరణం

4.  ప్రభు మార్గము విడచితిని - ప్రార్థించుట మానితిని ప్రభువాక్యము వదలితిని - పరమార్ధము మరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై యిపుడు - పాటింతు నీ మాట ||నడిపించు||

4వ చరణం

5.  లోతైన జలములలో - లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి - లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పనగా - లోకేష చేయుమయా ||నడిపించు||

5వ చరణం

6.  ప్రభు యేసుని శిష్యుడనై - ప్రబు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో - పరిశుద్ధుని ప్రేమకధ పరమాత్మ ప్రోక్షణలో - పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు - పానార్పణము జేతు ||నడిపించు||