TG-3133
Telugu

అన్ని వేళల వినువాడు

Anni Velala Vinuvaadu

0
views
పల్లవి

అన్ని వేళల వినువాడు నీ ప్రార్ధనలన్నియు ఏ బేధము లేకనే ఆలకింపనైయున్నాడు (2) ప్రార్ధించుము అలయకనే కనిపెట్టుము విశ్వాసముతో (2) నీ ప్రార్ధనే మార్చును నీ స్థితి నీ ఎదలో కన్నీరు తుడచును ||అన్ని||

1వ చరణం

కుమిలిపోతూ నలిగిపోతూ ఏమౌతుందో అర్ధం కాక (2) వేదన చెందుతూ నిరాశలో మునిగావా (2) ఒకసారి యోచించుమా నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే (2) ||అన్ని||

2వ చరణం

ఎవరికీ చెప్పుకోలేక అంతగా బాధ ఎందుకు (2) మొఱ్ఱపెట్టిన వారికి సమీపముగా యేసు ఉండును (2) ఒకసారి యోచించుమా నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే (2) ||అన్ని||