TG-5117
Telugu

నమ్మరె నరులార యేసుని సమ్మతిగాఁ జేరి

Nammare Narulaara Yeesuni Sammathigaan Jeeri

0
views
పల్లవి

నమ్మరె నరులార యేసుని సమ్మతిగాఁ జేరి నమ్మిన వారల నిమ్ముగ బ్రోచును సొమ్ముగ తను జేర్చి ||నమ్మరె||

1వ చరణం

1.  యేసు క్రీస్తుకంటెఁ పోషకు లెవ్వరు లేరుసుమీ దోషుల తన దాసులుగాఁ దీసియు దోసముఁ బాపు సుమీ ||నమ్మరె||

2వ చరణం

2.  నరకము నొందక మీ రయ్యో నరకము బాధ సుమీ న్యాయము కాదుసుమి నరులార నష్టము మీకు సుమీ ||నమ్మరె||

3వ చరణం

3.  తండ్రి కొమరుఁడు విమ లాత్ముఁడు త్ర్యేకదేవుండు తండ్రి వలెను మనలను పాలించును తండ్రిగ నమ్ముదము ||నమ్మరె||

4వ చరణం

4.  ధరణిలో నొకఁడైన చూడరె ధన్యుడు లేఁడనుచు దీర్ఘదర్శి దావీదు తెల్పె నిటు దీనుల కందఱికి ||నమ్మరె||

5వ చరణం

5.  ప్రభు మన పాపముకై ప్రాణము బలిగా నిచ్చునుగా పాపము మోసెను మృతియై లేచెను పాపులఁ బ్రోచుటకై ||నమ్మరె||

6వ చరణం

6.  దేవసుతుని రక్తం అబ్బిన ద్రోహుల కతిప్రొయము పావన మొనరించును పాపికి నిఁక జీవనమై యుండున్ ||నమ్మరె||