నిను స్తుతియించే కారణం ఏమని

ninu sthuthiyinchee kaarannam eemani

🎵 TG-1669🌐 Telugu
పల్లవి

నిను స్తుతియించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా (2) ప్రతి క్షణము ప్రతి దినము స్తుతియించుటే నా భాగ్యము స్తుతియించుటే నా జీవము ||నిను||

1వ చరణం

ఉన్నత స్థలములలోన నీకు స్తోత్రము అగాధ జలములలోన నీకు స్తోత్రము పరమందు నీకు స్తోత్రం ధరయందు నీకు స్తోత్రం ప్రతి చోట నీకు స్తోత్రం ప్రతి నోట నీకు స్తోత్రం (2)    ||నిను||

2వ చరణం

చీకటి లోయలలోన నీకు స్తోత్రము మహిమాన్విత స్థలములలోన నీకు స్తోత్రము గృహమందు నీకు స్తోత్రం గుడిలోన నీకు స్తోత్రం నిన్నటి మేలుల కొరకై నీకు స్తోత్రము ఈ దిన దీవెన కొరకై నీకు స్తోత్రము శ్రమలైనా నీకు స్తోత్రం కరువైనా నీకు స్తోత్రం

Report Error