TG-1671
Telugu

నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో

nannentagaa preeminchitivoo ninnantagaa dooshinchitinoo

Advitheeya Premaబ్రో. జాషువు షైక్ · Bro. Joshua Shaikబ్రో. నిస్సి జాన్ · Bro. Nissi John
81
views
పల్లవి

నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నే మరచితినో గలనా – నే చెప్పగలనా దాయనా – నే దాయగలనా (2) అయ్యా… నా యేసయ్యా నాదం – తాళం – రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము(2) ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో (2) ||గలనా||

1వ చరణం

ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో (2) ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో (2) ||గలనా||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.