TG-3846
Telugu

నేడే ప్రియరాగం

Nede Priyaraagam

0
views
పల్లవి

నేడే ప్రియరాగం పలికే నవ గీతం ప్రేమే మన కోసం వెలసే లోకాన శాంతి మురిసింది మన మనసుల్లో రాగాల కాంతి విరిసింది ||నేడే||

1వ చరణం

దివినేలు దేవుడు ఉదయించగానే ఇలలోన ప్రకృతి పులకించెగా పరలోక దూతలు స్తుతియించగానే జగమంతా ఉప్పొంగి నర్తించెగా ||నేడే||

2వ చరణం

మనిషైన సుతుడు జనియించగానే విశ్వాన గోళాలు విభవించెగా చిన్నారి యేసుని చిరునవ్వుతోనే నవ కాంతి లోకాన ప్రభవించెగా ||నేడే||

3వ చరణం

హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ హ్యాప్పీ క్రిస్మస్ టు యు… లోకాన శాంతి మురిసింది మన మనస్సులో రాగాల కాంతి విరిసింది Preme Mana Kosam Velase Lokaana Shaanthi Murisindi Mana Manasullo Raagaala Kaanthi Virisindi ||Nede||