ఆనందింతుము ఆనందింతుము
Aanandinthumu Aanandinthumu
ఆనందింతుము ఆనందింతుము యేసుని సన్నిధిలో ఆనందింతుము.. హే (2) గంతులేసి నాట్యమాడి ఉత్సహించి పాడెదం (2) యేసుని సన్నిధిలో ఆనందింతుము (2) ||ఆనందింతుము||
భయమూ ఎందుకూ… దిగులూ ఎందుకూ దేవాది దేవుని తోడు మనకుండగా (2) హల్లెలూయ అంటు ఆరా-ధింతుము ఎల్లప్పుడూ (2) యేసుని సన్నిధిలో ధైర్యమొందెదం (2) ||ఆనందింతుము||
నీతి లేని లోకంతో స్నేహం ఎందుకూ నీతి సూర్యుడైన యేసు మనకూ ఉండగా (2) పరిశుద్దుడంటూ పొగడి కొలిచెదము అనుదినం (2) యేసుని సన్నిధిలో పరవశించెదం (2) ||ఆనందింతుము||
ప్రేమలేని హితుల సఖ్యం ఎందుకూ ప్రేమామయుడైన ప్రభువు మనకు ఉండగా! (2) మహిమకరుడు అంటూ మ్రొక్కి పూజింతుము అనుక్షణం (2) యేసుని సన్నిధిలో ఉత్సాహించెదం (2) ||ఆనందింతుము||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.