TG-3046
Telugu

ఆరాధన అందుకో

Aaraadhana Anduko

27
views
పల్లవి

ఆరాధన అందుకో (2) పాప క్షమాపణ జీవమునిచ్చిన కరుణామయా.. అందుకో ఆరాధన అందుకో అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవా మోషేతో అన్నావు ఉన్నానని (2) అల్ఫయు నీవే ఓమెగయును (2) ఆద్యంత రహితుండ నీవేనని ఘనతా మహిమా నీకేయని హల్లెలూయా గానము చేసెదను పాప క్షమాపణ జీవమునిచ్చిన కరుణామయా.. అందుకో ఆరాధన అందుకో పాపంబున జన్మించి నశియించితిని లోకంబు నాదనుచు ఆశించితిని (2) అయినా నీవు రక్షణ నివ్వ (2) వెలిగించి పంపితివి యేసు ప్రభును ఘనతా మహిమా నీకేయని హల్లెలూయా గానము చేసెదను పాప క్షమాపణ జీవమునిచ్చిన కరుణామయా.. అందుకో ఆరాధన అందుకో తెలిసికొంటిని నా యేసు నిన్ను సర్వ శక్తి గల ప్రభువనియు (2) రానున్నావు మరలా నాకై (2) ఆనంద దేశములో నన్నుంచుటకై ఘనతా మహిమా నీకేయని హల్లెలూయా గానము చేసెదను పాప క్షమాపణ జీవమునిచ్చిన కరుణామయా.. అందుకో ||ఆరాధన||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.