♪♫
TG-5297
Telugu
నీ సన్నిధిలో ఈ ఆరాధనను
Nee Sannidhiloo Ee Aaraadhananu
0
views
పల్లవి
నీ సన్నిధిలో ఈ ఆరాధనను స్వీకరించుము నా ప్రభువా (2) నా హృదయములో నీ ఆత్మ బలమును నింపుము నాపై యేసయ్యా ||నీ సన్నిధిలో||
1వ చరణం
ఆవిరివంటి వాడను నేను మేఘ స్తంభమై నిలిచావు (2) చల్లని నీ ప్రేమ గాలిని సోకించి (2) వర్షముగా నను మార్చావు – మార్చావు ||నీ సన్నిధిలో||
2వ చరణం
మోడులా మిగిలిన నాకై సిలువ మ్రానిపై వ్రేళాడి (2) నీ రక్తముతో నను ప్రోక్షించి (2) నా మరణ శాపం తొలగించావు – తొలగించావు ||నీ సన్నిధిలో||