♪♫
TG-1546
Telugu
నన్ను నీవలె నిర్మించినను కోల్పోతి
nannu neevale nirminchinanu koolpoothi
78
views
పల్లవి
నన్ను నీవలె నిర్మించినను కోల్పోతి దేవా నీ రూపమును హేయ క్రియలతో సిలువేసినను నాపై నీ కృపను తొలగించవెందుకు నిను బాధించినా భరియించితివా నా పాపం జ్ఞాపకమే రాలేదా (2) ||నన్ను||
1వ చరణం
ఎరిగి ఎరిగి చెడిపోతిని తెలిసి తెలివిగా తప్పిపోతిని (2) బ్రతికున్న శవమునై నేనుంటిని అహము ముదిరి పది లేవలేకపోతిని భయభక్తులు లేని వెర్రివాడనై కుంపటి ఒడిలో పెట్టుకుంటిని ఒక పూటకూటికై ఆశపడితిని వ్యభిచారినై వెక్కివెక్కి ఏడ్చుచుంటిని సిల్వలో నీ శ్రమ చూడకుంటిని కల్వరి ప్రేమను కానకుంటిని నిన్ను సిలువ వేయమని కేకలేసితి అయినా క్షమించి కౌగిలించి ముద్దుపెట్టుకుంటివా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.