పరలోకమే నా అంతఃపురం చేరాలనే

paralookamee naa anthahpuram cheeraalanee

🎵 TG-1548🌐 Telugu
పల్లవి

పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం (2) యేసుదేవరా – కనికరించవా – దారి చూపవా (2) ||పరలోకమే||

1వ చరణం

స్వల్ప కాలమే ఈ లోక జీవితం నా భవ్య జీవితం మహోజ్వలం మజిలీలు దాటే మనోబలం నీ మహిమ చూసే మధుర క్షణం వీక్షించు కన్నులు – విశ్వాస జీవితం – నాకు ఈయవా పాపము నెదిరించే శక్తిని నాకివ్వు పరులను ప్రేమించే మనసే నాకివ్వు ఉద్రేక పరచే దురాత్మను ఎదురించి పోరాడే శుద్ధాత్మను మోకాళ్ళ జీవితం – కన్నీటి అనుభవం – నాకు నేర్పవా

Report Error