ఓరన్న… ఓరన్న యేసుకు సాటి

ooranna… ooranna yeesuku saati

🎵 TG-1544🌐 Telugu
పల్లవి

ఓరన్న…  ఓరన్న యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా ||ఓరన్న||

1వ చరణం

చరిత్రలోనికి వచ్చాడన్నా – వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా – తెచ్చాడన్నా (2) అద్వితీయుడు ఆదిదేవుడు ఆదరించును ఆదుకొనును పరమును విడచి వచ్చాడన్నా – వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా – పుట్టాడన్నా పరిశుద్దుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను సిలువలో ప్రాణం పెట్టాడన్నా – పెట్టాడన్నా మరణం గెలిచి లేచాడన్న – లేచాడన్న మహిమ ప్రభూ మృత్యుంజయుడు క్షమియించును జయమిచ్చును

Report Error