TG-5307
Telugu

నీ స్వరము వినిపించు ప్రభువా

Nee Svaramu Vinipinchu Prabhuvaa

0
views
పల్లవి

నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్ (2) నీ వాక్యమును నేర్పించు దానియందు నడుచునట్లు నీతో ||నీ స్వరము||

1వ చరణం

ఉదయమునే లేచి – నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు – నను సిద్ధపరచు రక్షించు ఆపదలనుండి (2) ||నీ స్వరము||

2వ చరణం

నీ వాక్యము చదివి – నీ స్వరము వినుచు నేను సరి చేసికొందు నీ మార్గములో – నడుచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ (2) ||నీ స్వరము||

3వ చరణం

భయ భీతులలో – తుఫానులలో నీ స్వరము వినిపించుము అభయము నిమ్ము – ఓ గొప్ప దేవా ధైర్య పరచుము నన్ను (2) ||నీ స్వరము||

4వ చరణం

నాతో మాట్లాడు – స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కొరకే నీతో మనుష్యులతో – సరిచేసికొందు నీ దివ్య వాక్యము ద్వారా (2) ||నీ స్వరము||

5వ చరణం

నేర్చుకున్నాను – నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నన్నుంచుము ప్రభువా – నీ విశ్వాస్యతలో నీ యందు నిలచునట్లు (2) ||నీ స్వరము||

6వ చరణం

నా హృదయములోని – చెడు తలంపులను చేధించు నీ వాక్యము నీ రూపమునకు – మార్చుము నన్ను నీదు మహిమ కొరకేగా (2) ||నీ స్వరము||